ఇనయా సుల్తానా… ఈపేరు చెబితే ఆమె ఎవరా అని ఆలోచిస్తారు. అదే ఆర్జీవీ బ్యూటీ అంటే మాత్రం మీరు టక్కున గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు ఆమెనే ఓ పార్టిసిపెంట్ గా బిగ్ బాస్ 6 లోకి అడుగుపెట్టింది. ఇకపోతే గతేడాది ఇనయా బర్త్ డే పార్టీకి ఆర్జీవీ వెళ్లడం, ఆమెని కౌగిలించుకుని, కాళ్లు పట్టుకోవడంతో ఇనయా ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది. అలాంటి ఇనయా ఈసారి బిగ్ బాస్ లో గ్లామర్ షో చేయడం పక్కా అని ఎంట్రీలో వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తేనే తెలిసిపోతుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇనయా గురించి చెప్పాలంటే ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా, సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చానని.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా ఎదిగింది. ఏవమ్ జగత్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రాంగోపాల్ వర్మ పరిచయమయ్యారని ఆమె చెప్పింది. తన బర్త్ డే పార్టీలో ఆయనతో డ్యాన్స్ చేయడం వల్ల అమ్మ తిట్టిందని, ఫ్యామిలీకి కూడా దూరమయ్యానని చెబుతూ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఇనయా ఏడ్చేసింది.
ఇలా కెరీర్ పరంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇనయా.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తన లక్ పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మరి ఇనయా వలలో బిగ్ బాస్ పడతాడా అనేది చూడాలి. ఎందుకంటే ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి రాత్రికి రాత్రికి ఫేమస్ అయిన యాంకర్ అరియానా.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. యాంకర్, నటిగా బిజీ అయిపోయింది. సో ఇవన్నీ చూస్తుంటే.. ఇనయా కూడా బిగ్ బాస్ లో పాల్గొని ఫేమస్ అవుతుందేమో. మరి ఇనయా ఎన్ని వారాలు ఉంటుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇనయా సుల్తానా ఇన్ స్టా ఐడీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదీ చదవండి: ఎపిసోడ్‌కి రూ.55 లక్షలు! నాగార్జున రెమ్యూనరేషన్ లెక్కలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!