ప్రముఖ రియాల్టీ షో ‘‘బిగ్ బాస్’’కు ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులారిటీ ఉంది. ఈ షో ఇండియాలో మొట్టమొదటి సారి హిందీలో మొదలైంది. ప్రస్తుతం 15కు పైగా సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఈ షో తెలుగులో 2017లో మొదలైంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఆరో సీజన్‌కూడా పూర్తి కావటానికి సిద్ధంగా ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. తాజాగా, ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయింది. అయితే, సీజన్ 5నుంచి బిగ్‌బాస్‌కు ఉన్న ఊపు తగ్గుతూ వచ్చింది. సీజన్ 4ను చూసినంత ఆసక్తిగా జనం 5,6ను చూడలేదు.
ఇందుకు ప్రధాన కారణంగా సరైన కంటెస్టెంట్లు లేకపోవటం.. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ చేయటం అని చెప్పొచ్చు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆటలో గతంతో పోల్చుకుంటే పస తగ్గిపోయింది. ఎలిమినేషన్ల విషయంలోనూ జనం ఊహించని వారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌కు సంబంధించిన పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రొడక్షన్ బాయ్‌గా పని చేసే ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన విషయాలను చెప్పొకొచ్చాడు. అతడు మాట్లాడుతూ… ‘‘ బిగ్‌బాస్ షోలో ప్రతీది స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. మీకు కనబడేది కేవలం ఒక మేయిన్ డోర్ మాత్రమే కానీ, చుట్టూ దాదాపు 26 డోర్లు ఉంటాయి. మేము అన్నీ అందిస్తూ ఉంటాము. ఎలిమినేట్ అయిన తర్వాత ఓ సీక్రెట్ రూములో ఉంచుతారు.
బయటి వాళ్ల ఓటింగ్‌తో సంబంధం లేదు. ఈ సారి అంతా ముందే డిసైడ్ అయిపోయింది. రేవంత్ విన్నర్ అవుతాడు. ఆదిరెడ్డిని మొన్నే ఎలిమినేట్ చేయాలనుకున్నారు. కానీ, కామన్ మ్యాన్ ఇంత వరకు రావటం ఇదే మొదటిసారి కాబట్టి.. ఇంకొన్ని నాళ్లు ఉంచాలనుకుంటున్నారు. మేము మొత్తం ఓ 50 మంది దాకా పనిచేస్తున్నాము. లోపల జరిగేది ఒకటి.. చూపించేది ఒకటి. ప్రతీ ఎలిమినేషన్ ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. ఈ సారి షోకు అంత హైప్ లేదు. ఇనయా ఎలిమినేషన్‌తో టీఆర్‌పీ పెరిగింది. బిగ్‌బాస్ షో కొంత ఫేక్.. కొంత రియాలిటీ ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.