ఎట్టకేలకు బిగ్‌బాస్ సీజన్ 6 ముగిసింది. అందరూ ముందే ఊహించినట్లుగా.. సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. ఈ సారి బిగ్‌బాస్ సీజన్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్.. ఏకంగా 40 లక్షల రూపాయలు గెలిచాడు.. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన.. రేవంత్‌కు మాత్రం ప్రైజ్‌మనీలో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే దక్కాయి. ఇక చివర్లో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్‌కు రేవంత్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక 21 మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్ ప్రారంభమైంది. వీరిలో కొంతమంది మాత్రమే మంచి ఆటతీరు ప్రదర్శించి.. ప్రేక్షకులను అలరించారు. ఇక ఆటతీరు ఎలా ఉన్నా సరే.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తిండిపోయే అనుభవం. కానీ ఓ కంటెస్టెంట్‌కు మాత్రం బిగ్‌బాస్ జీవితాంతం మర్చిపోలే మధురానుభూతి మిగిల్చింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
బిగ్‌బాస్ ఫినాలే.. ఎపిసోడ్‌కి కంటెస్టెంట్లు అందరూ తప్పకుండా వస్తారు. నేహా చౌదరి కూడా ఈ ఫినాలే ఎపిసోడ్‌కు వచ్చింది. అందరితోపాటు తను వచ్చింది.. దానిలో అంత ప్రత్యేక ఏంటి అంటే.. బిగ్‌బాస్ ఫినాలే రోజునే… నేహా చౌదరి వివాహం. పెళ్లికి కొన్ని గంటల ముందే ఫైనల్. దీంతో పెళ్లి కూతురిని చేసిన తర్వాత.. నేహా చౌదరి.. డైరెక్ట్‌గా బిగ్‌బాస్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో బిగ్‌బాస్ షో జరుగుతున్నపటికి.. నేహా చౌదరి విషయంలో జరిగినట్లు.. ఎవరికి జరగలేదు అని చెప్పవచ్చు.
ఆదివారం రాత్రి పది గంటల తర్వాత నేహా చౌదరి పెళ్లి ముహూర్తం.. ఇక అప్పటికే బిగ్ బాస్ ముగిసింది. అలా బిగ్ బాస్ ఫైనల్ ముగియగానే ఆమె నేరుగా బిగ్‌బాస్ నుంచి.. కళ్యాణమండపానికి చేరుకుంది. పెళ్లి పీటలు ఎక్కి.. వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. బిగ్ బాస్ 6 టీమ్‌తో నేహా చౌదరి, ఆమె భర్త దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. నేహా చౌదరి.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రావడానికన్నా ముందే.. స్పోర్ట్స్ యాంకర్‌గా చాలామందికి పరిచయం. పైగా ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని వాళ్లింట్లో వాళ్లకు చెప్పింది. అన్నట్లుగానే వివాహం చేసుకుంది. తన క్లాస్‌మేట్ అనిల్‌నే ఆమె వివాహం చేసుకుంది.
అయితే బిగ్ బాస్ ఫైనల్.. నేహ పెళ్లి ముహూర్తం ఒకటే రోజు.. ఒకే సమయంలో రావడం విశేషమనే చెప్పాలి. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున సహా అందరికీ చెప్పింది నేహా చౌదరి. పెళ్లి కూతుర్ని చేయగానే ఆమె బిగ్ బాస్ ఫినాలేకి వచ్చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుండటంతో.. బిగ్ బాస్ ఫినాలే జరుగుతుండగానే నేహా చౌదరి పెళ్లి మండపానికి వెళ్లింది. వివాహం చేసుకుని నూతన జీవితంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం నేహా చౌదరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.