శ్రీ సత్య.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్, బుల్లితెర ప్రేక్షకుల్లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. మొదటి రెండు వారాలు సోఫాకే పరిమితమై కబుర్లు చెబుతూ కూర్చున్న ఈ భామ, మూడోవారం మాత్రం చెలరేగి ఆడుతోంది. అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో పోలీసుగా గేమ్ ఇరగదీసింది. రాత్రిపూట కూర్చొని గేమ్ ఆడటం లేదన్నారు.. ఇప్పుడు ఆడాను అరిచాను, కేకలు వేశాను, కిందపడి దొర్లాను, దెబ్బలు కూడా తగిలించుకున్నాను, కావాల్సినంత కంటెంట్ ఇచ్చాను అంటూ శ్రీ సత్య కామెంట్ చేసింది. గేమ్‌లో లీనమైపోయి నానా హంగామా చేసింది. చివరకి ఎలాగైతే తన పోలీసుల టీమ్ టాస్కులో గెలిచింది. శ్రీ సత్య కూడా కెప్టెన్సీ కంటెండర్‌గా మారింది.
అయితే శ్రీ సత్య హౌస్‌లోకి వచ్చిన తర్వాత మొదటివారం నామినేషన్స్ లో ఆమెకు యాటిట్యూడ్ ఉందంటూ అంతా నామినేట్ చేశారు. అప్పుడు ఆమె మాట్లాడుతూ నా లైఫ్‌లో జరిగిన కొన్ని ఘటనల వల్ల తాను మనుషులకు దూరంగా, ఒంటరిగా గడుపుతున్నట్లు చెప్పుకొచ్చింది. తనకి అందరితో కలవడం, మాట్లాడటం నచ్చదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సంఘటనలు ఏంటనేది తర్వాత టాస్కులో వెల్లడించింది. తాను ఒక వ్యక్తిని ప్రేమించానని కానీ అతను మోసం చేశాడని చెప్పింది. అలా చేయడం వల్ల తన తల్లి షాక్‌కు గురయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పింది. ఆమె మంచానికే పరిమితమైందని.. తండ్రే చిన్న పిల్లని చూసుకున్నట్లు చూసుకుంటాడని చెప్పుకొచ్చింది.
తాను కేవలం బిగ్ బాస్ హౌస్‌కి డబ్బు, ఫేమ్ కోసమే వచ్చానని శ్రీ సత్య ఓపెన్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తనకి డబ్బు చాలా అవసరమని అందుకోసమే తాను వచ్చినట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకున్న పవన్ రెడ్డి వ్యాఖ్యలు వేరేలా ఉన్నాయి. తనని మోసం చేశాడని చెబుతున్న శ్రీ సత్య మాటలను పవన్ రెడ్డి ఖండించాడు. నిజానికి ఆమె చేతిలో తానే మోసపోయినట్లు పవన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు. మోసం చేసే వాడినైతే అసలు పెళ్లి వరకు ఎందుకు తీసుకెళ్తాను? ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటానంటూ పవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. శ్రీ సత్యే తనని మోసం చేసిందని పవన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. అయితే వీరి ఆరోపణల్లో నిజం ఎంత, ఎవరు ఎవరిని మోసం చేశారు? ఎందుకు మోసం చేశారు? అనే ప్రశ్నలకు వారే సమాధానాలు చెప్పాల్సి ఉంది. శ్రీ సత్య ప్రేమ, ఎంగేజ్మెంట్, బ్రేకప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.