బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. షో పూర్తి కావడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. ఫినాలేకు సంబంధించి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరనేదానిపై చాలా చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలోనే అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంకొందరైతే కాస్త ముందుకెళ్లి.. విజేతకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే విజేతగా నిలిచిన వ్యక్తి కాకుండా ఆ తర్వాత ఎవరెవరు నిలిచారు? లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీవీ రియాలిటీ షోల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన షో అంటే చాలామంది చెప్పేమాట ‘బిగ్ బాస్’. తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ షోపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే ప్రతి సీజన్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. గత ఐదు సీజన్లు బాగానే నడిచినప్పటికీ.. ఓటీటీలో టెలికాస్ట్ చేసిన సీజన్ మాత్రం ఆడియెన్స్ ని ఏ మాత్రం ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ఇక దానికి తోడు.. ఈసారి సీజన్ మరింతగా డిసప్పాయింట్ చేసింది! కంటెస్టెంట్స్ లో సింగర్ రేవంత్ తప్పించి, మిగిలిన ఎవరూ కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
అలానే గత సీజన్లలో ఉన్నట్లే ఈ సీజన్ లోనూ దాదాపు అవే గేమ్స్ పెడుతూ వచ్చారు. దీంతో ఈ షోని చూసే ప్రేక్షకులు కూడా బోరింగ్ గా ఫీలయ్యారని సోషల్ మీడియాలోనూ వినిపించింది. అందుకు తగ్గట్లే టీఆర్పీలు కూడా ఈసారి చాలా తక్కువగానే నమోదయ్యాయి. ప్రారంభంలో కాస్త నీరసంగా అనిపించిన బిగ్ బాస్ షో.. గీతూ, ఇనయా లాంటి కంటెస్టెంట్స్ వల్ల గొడవలు, కొట్లాటలతో ఇంట్రెస్టింగ్ గా మారింది. టాప్ లో ఉంటారు, ఫినాలేకు వస్తారు అనుకున్న ఈ ఇద్దరూ ముందే ఎలిమినేట్ అయిపోవడం చాలామందికి షాకింగ్ గా అనిపించింది. ఇక గతవారం ఇనయా ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.
దీంతో ఫినాలే కోసం ఏకంగా ఆరుగురు మిగిలారు. ఈ లిస్టులో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ ఉన్నారు. అయితే వీరిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరు చెప్పి, శ్రీసత్యని ఇంటికి పంపించేశారు. శుక్రవారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. అదే టైంలో ఫినాలేకు సంబంధించిన ఓటింగ్ లైన్స్ కు క్లోజ్ అయ్యాయి. ఇక ఇందులో రేవంత్ ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇతడే ‘బిగ్ బాస్ 6’ విన్నర్ గా నిలిచాడని సమాచారం. రన్నర్ గా శ్రీహాన్ ఉన్నాడని.. ఆ తర్వాత స్థానాల్లో ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఉన్నారని తెలుస్తోంది. శనివారం.. టాప్-5 నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఆదివారం సాయంత్రం విన్నింగ్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయనున్నారు. ఇక రేవంత్ విన్నర్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Cheer on all the Rangers who are fighting for our #Revanth. ❤
Rangers ఇది మన విజయం మన అందరి విజయం❤❤❤. pic.twitter.com/bB8Z8UUdOW— ROCKBLASTER💥💫❤️. (@Rocktheblaster) December 16, 2022