ఓరి బాబోయ్.. లైవ్ లో ఆ థాయ్ మసాజ్ లు ఏంటి? బట్టలిప్పి పడుకోవడం ఏంటి? ఇది రియాలిటీ షో అనుకుంటున్నారా.. మసాజ్ సెంటర్ అనుకుంటున్నారా.. ఇది మేం అనుకుంటున్నది కాదు.. బిగ్ బాస్ చూస్తున్న సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. గత సీజన్లతో పోలిస్తే… ఈసారి షో రేటింగ్స్ చాలా దారుణంగా వస్తున్నాయి. హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ లో చాలామంది.. గేమ్స్ అంటే అస్సలు ఇంట్రెస్టే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ టీమ్ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఆ అయోమయంలో పిచ్చిపిచ్చి ప్రయోగాలన్నీ చేస్తోంది. ఎక్కడలేని తలనొప్పులు తెచ్చుకుంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచో చెడో నలుగురూ షో గురించి మాట్లాడుకోవాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తాం అనేది బిగ్ బాస్ నిర్వహకులు ప్లానేమో! గత ఐదు సీజన్లు కూడా కొద్దో గొప్పో ఎంటర్ టైనింగ్ గా ఉండేవి. ఈసారి మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. హౌసులో అడుగుపెట్టిన రేవంత్ తప్పించి.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఆడియెన్స్ కి సరిగ్గా తెలీదు. ఇక షో మొదలైన తర్వాత యాక్టివ్ గా ఉన్న గీతూ.. ప్రేక్షకులకు అలవాటైంది. మిగతా వారిలో ప్రతిరోజూ గొడవలు పడుతూ ఇనయా, శ్రీసత్యతో పులిహోర కలుపుతూ అర్జున్, ఆరోహితో హగ్గులు-ప్రేమ అంటూ ఆర్జే సూర్య.. తెగ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వాళ్లందరూ కూడా దొరికిందే ఛాన్సు అన్నట్లు రెచ్చిపోతున్నారు. దానికి కారణం బిగ్ బాస్ పెట్టిన తాజా టాస్క్.
నాలుగో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘హోటల్ వర్సెస్ హోటల్’ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ‘బీబీ హోటల్’, ‘గ్లామ్ హోటల్’ అని విభిజించాడు. గ్లామ్ హోటల్ లో ఫైమా మేనేజర్ కాగా శ్రీసత్య, వాసంతి, ఫైమా, కీర్తి సర్వెంట్స్. బీబీ హోటల్లో సుదీప మేనేజర్ కాగా, రేవంత్, బాలాదిత్య, గీతూ, మరీనా సర్వెంట్స్. మిగతా వారిలో సూర్య మతిస్థిమితం లేని కుర్రాడు. ఇనయా రాజకుమారి. ఈ టాస్కులో గెస్టులు సర్వెంట్లతో పనిచేయించుకుని డబ్బులివ్వాలి. ఎక్కువ డబ్బులున్నవారు కెప్టెన్సీ పోటీదారులవుతారు. దీంతో కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ తెగించేశారు. ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అని గట్టిగా అనుకున్నారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.
వచ్చిందే ఛాన్సు అన్నట్లు అర్జున్, ఆర్జే సూర్య రెచ్చిపోయారు. వ్యక్తిగత కోరికలు తీర్చుకున్నారు. శ్రీసత్యతో గోరుముద్దలు తినిపించుకోవడం, టచ్ చేయనని తెగేసి చెప్పిన ఆమె భుజంపైనే చేతులు వేసుకుని ఫొటోలు దిగడంతో అర్జున్ ఆగిపోయాడు. సూర్య మాత్రం అంతకు మించిన అన్నట్లు ప్రవర్తించాడు. ఏకంగా ఒంటిపై షార్ట్ తప్పించి బట్టలిప్పేసి వచ్చాడు. హౌసులో తన లవ్ ఆరోహితో థాయ్ మసాజ్ చేయించుకున్నాడు. హౌసులో ఉన్నవారికి ఇది చాలా నార్మల్ అనిపించొచ్చు గానీ టీవీ చూస్తున్న ప్రేక్షకులు అయితే ఒక్కసారిగా షాకయ్యారు. అసలు ఇది బిగ్ బాస్ హౌసా లేదా ఇంకేమైనా అని మాట్లాడుకుంటున్నారు. డబ్బుల కోసం కంటెస్టెంట్స్ ఎంతకైనా తెగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పలువురు నెటిజన్స్ అయితే షోపై, హోస్ట్ నాగార్జునపై నేరుగానే ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరోహి -RJ సూర్య మధ్య రచ్చ! ఇది లవ్ కాదు భయ్యా పెద్ద బూతు!