ఈ అమ్మాయి అసలు ఇంత ధైర్యం ఎక్కడిది? ఎవడ్రా నన్ను ఆపేది అని డైరెక్ట్ గానే అంటోంది. అయినా సరే ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే తనని ఏం చేసిన పర్లేదు, గేమ్ లో గెలవడమే ముఖ్యమని బల్లగుద్ది చెబుతోంది. అవసరమైతే తన డ్రస్ లో చేతులు పెట్టిన ప్రాబ్లమ్ లేదని అంటోంది. బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులందరూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఆమెనే గీతూ రాయల్. షో కూడా ఆమెపైనే పూర్తిగా ఫోకస్ అయినట్లు కనిపిస్తోంది. ఇంతకీ గీతూ అంటే బిగ్ బాస్ కి ఎందుకంత ప్రేమ?
ఇక వివరాల్లోకి వెళ్తే.. యూట్యూబ్ లో బిగ్ బాస్ షో రివ్యూలు చేసే గీతూని ఈసారి కంటెస్టెంట్ గా హౌసులోకి తీసుకొచ్చారు. తొలిరోజే ఈమె వాగుడు చూసి చాలామంది నెగిటివ్ గా అనుకున్నారు. కానీ జస్ట్ కొన్ని రోజుల్లో మిగతావారికి సీన్ మొత్తం అర్ధమైపోయింది. గీతూ పక్కా స్ట్రేటజీతోనే హౌసులోకి అడుగుపెట్టింది. తూచా తప్పకుండా అలానే ఆడుతోంది. గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తానని ఇతర హౌసుమేట్స్ కి సవాలు విసురుతోంది. ఇవన్నీ చూసి గీతూని కొందరు విమర్శస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బిగ్ బాస్ ని సరిగా అర్ధం చేసుకుని గేమ్ ఆడుతుంది తనొక్కతే. ఆటలో తన అమ్మనాన్న ఉన్నాసరే, వాళ్లని కూడా ఓడించి తీరుతా అని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఇది చూసి హోస్ట్ నాగార్జునకు కూడా ముచ్చటేసింది. అందుకే తెగ చప్పట్లు కొట్టాడు.
ఇక మిగిలిన వారి విషయానికొస్తే.. శ్రీసత్య, వాసంతిలు గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. రేవంత్ పర్వాలేదనిపిస్తున్నాడు. శ్రీహాన్ నెమ్మదినెమ్మదిగా లైన్లోకి వస్తున్నాడు. బాలాదిత్య అయితే ఇంకా రియల్ పర్సన్ ని బయటకు తీయనట్లు కనిపిస్తోంది. సూర్య-ఆరోహి.. ఇద్దరికీ కూడా ఆడే సత్తా ఉన్నా.. ఒకరిని ఒకరి వెనక్కి లాక్కుంటున్నారా అనిపిస్తోంది. ఆదిరెడ్డి కూడా పక్కా గేమ్ స్ట్రాటజీతో ఆడుతున్నాడు. తొలివారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ఇనయా కూడా సెట్ రైట్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ దూకుడు చూపిస్తోంది. అర్జున్ కల్యాణ్, శ్రీసత్యతో పులిహార కలపడం తప్పించి వేరే విషయాల్లో కనిపించట్లేదు. ఫైమా, చంటి.. జబర్దస్త్ ఫెర్ఫామన్స్ ఇవ్వాల్సి ఉంది. నేహా చౌదరితో పాటు మిగతా వాళ్లు ఉన్నరంటే ఉన్నరు అన్నట్లు ఆడుతున్నారు.
తొలి వారం నుంచి బిగ్ బాస్ పెట్టిన ప్రతి గేములోనూ గీతూనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. రైటో రాంగో.. బిగ్ బాస్ కెమెరాలన్నీ గీతూనే చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే గీతూ కూడా పక్కా ఫెర్ఫామెన్స్ ఇస్తూ రోజురోజుకి దూసుకుపోతోంది. ఇదంతా చూస్తుంటే ఆమె తప్ప ఎవరూ ఆడటం లేదా అనిపిస్తోంది. ఏదో వచ్చాం వెళ్లాం అన్నట్లుగా ఉంటే అభినయ, షానీలా ఎలిమినేట్ అయిపోతారు. ఇవన్నీ బాగా తెలుసు కాబట్టే ప్రతి ప్రోమోలో ఉండేలా గీతూ ఆడుతోంది. కాదు కాదు బిగ్ బాస్ ని ఆడిస్తోంది! ఈ సీజన్ లో ఎవరు ఉన్నా లేకపోయినా గీతూ మాత్రం పక్కా టాప్ 5లోకి వెళ్తుంది. ఇక బిగ్ బాస్ తలుచుకుంటే.. విన్నర్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి గీతూ గేమ్ ప్లే గురించి మీరేం అనుకుంటున్నారు. మీ ఒపినియన్ కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: గీతూ స్ట్రాటజీకి బిగ్ బాస్ కూడా బిత్తరపోవాల్సిందే.. ఏం జరిగిందంటే?
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన గీతూ రాయల్ లైఫ్ స్టోరీ..