బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మొదలైనప్పటి నుంచి కంటే ఇప్పుడు కాస్త జోరుగానే సాగుతోంది. గొడవలు, కేకలు, విమర్శలు, గ్రూపులు అంటూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నారు. మొదటి రెండు వారాల కంటే మూడో వారం కాస్త ఇంట్రెస్టింగ్ సాగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారంలో చాలా అప్‌డేట్లు జరిగాయి. చాలా మంది ప్రవర్తన, ఆట తీరు, మాటలు, గ్రూపులు అన్నీ మారిపోయాయి. మొదటి రెండు వారాల్లో ఉన్న టీమ్లు ఇప్పుడు ఉన్నట్లు కనపించడం లేదు. అంతేకాకుండా ఈసారి గీతూ రాయల్‌కి శ్రీహాన్- ఆర్జే సూర్యలతో కాస్త కనెక్షన్ వచ్చిందంట. ఈసారి కూడా గీతూ రాయల్ తన గేమ్ ప్లేతో విజయం సాధించింది. అయితే అసలు బిగ్ బాస్ హౌస్‌లో 18వ రోజు ఏం జరిగింది? ఆ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏం ఉన్నాయో చూద్దాం.
హౌస్‌లో ఉన్న ముద్దుగుమ్మ, గ్లామర్ బ్యూటీలో ఒకరైన శ్రీ సత్య.. ఇంట్లో కుర్రాళ్లను తెగ్ ఇబ్బంది పెడుతోంది. అందరూ నా అన్నయ్యలే అంటూ కామెంట్లు చేస్తోంది. మరోసారి అన్నయ్యా అనే మాటలు మొదలు పెట్టింది. అర్జున్ కల్యాణ్- శ్రీ సత్యతో అన్న అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుండగా.. నాకు ఇక్కడ అందరూ అన్నలే అనేసింది. రేవంత్ కూడా నాకు అన్నే.. రేవంత్ అన్నయ్యా అంటూ పిలిచింది. అయితే రేవంత్ మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పాడు. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నేను మాత్రం అన్నా అనే పిలుస్తాను అంటూ శ్రీ సత్య కుండ బద్దలు కొట్టేసింది. అర్జున్ కల్యాణ్ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకుంటే శ్రీ సత్య మాత్రం అన్నా అన్నా అంటూ ఆడేసుకుంటోంది. అయితే రేవంత్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనే దానిపై చర్చ కూడా నడుస్తోంది. అర్జున్ కల్యాణ్ ఒకసారి నేను యాక్సెప్ట్ చేయను అనే మాటకు కౌంటర్‌గా అలా పిలిచాడేమో అనే అభిప్రాయం కలుగుతోంది. మరి రేవంత్ మైండ్‌లో ఏముందో?
అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో దొంగల టీమ్‌పై పోలీసుల టీమ్ విజయం సాధించింది. దొంగల టీమ్ కంటే పోలీసులు రెండు బొమ్మలను ఎక్కువ కాపాడుకోగలిగారు. దొంగలు టీమ్ గీతూ రాయల్‌కి 51 బొమ్మలు అమ్మారు. ఇంక వాళ్ల దగ్గర 18 బొమ్మలు ఉన్నాయి. పోలీసులు 70 బొమ్మలను సేవ్ చేశారు. అంతేకాకుండా గోల్డెన్ ఎగ్‌ని కాపాడుకోగలిగారు. మొత్తం 71 బొమ్మలను పోలీసులు సేవ్ చేశారు. గీతూ రాయల్‌కి ఇచ్చిన టాస్కులో ఆమె విజయం సాధించింది. 25 బొమ్మలు కొనాల్సి ఉండగా 51 కొనింది. 15 వేలు ఉంచుకోవాల్సిందిగా చెప్పగా.. 15,800 సేవ్ చేసింది. ఈ టాస్కులో పోలీసులు జట్టుగా ఆడారు కాబట్టే విజయం సాధించారు. దొంగలు గ్రూపు అని ఒకసారి, వ్యక్తిగతంగా అని ఒకసారి, మళ్లీ గ్రూపు అని వారికే క్లారిటీ లేకుండా ఆడటం వల్లే ఓడిపోయారు.
అడవిలో ఆట టాస్కులో విజయం సాధించిన పోలీసులు నుంచి ఇద్దరు ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంచుకోవాలంటూ బిగ్ బాస్ కోరాడు. అందుకు ఆ జట్టు సభ్యులు ఆదిరెడ్డి, ఫైమాలను ఎంపిక చేశారు. గోల్డెన్ ఎగ్ తన దగ్గర ఉన్నందున శ్రీ సత్య నేరుగా కంటెండర్ అయిపోయింది. తన టాస్కులో విజయం సాధించినందున గీతూ రాయల్ నేరుగా కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. దొంగల టీమ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన ఒకరిని ఎంచుకోమనగా.. అంతా శ్రీహాన్‌కు ఓటేశారు. అలా ఆదిరెడ్డి, ఫైమా, గీతూ రాయల్, శ్రీ సత్య, శ్రీహాన్ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. వారికి పిరమిడ్స్ అనే టాస్కు పెట్టగా అందులో గీతూ రాయల్, ఫైమా డిస్కాలిఫై అయ్యారు. శ్రీ సత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.
హౌస్‌లో శ్రీ సత్య అంటే అర్జున్ కల్యాణ్ కి చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని అర్జున్ కల్యాణ్‌ని నేరుగా అడగ్గా తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తుంటాడు. నిజానికి నాగార్జున కూడా వారి మధ్య ఏదో ఉందని వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడగా.. అప్పుడు తప్పించుకున్నారు. ప్రేక్షకులు కూడా అర్జున్‌కి శ్రీ సత్యపై ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అదే మాటను శ్రీహాన్- నేహాతో చెప్పాడు. శ్రీ సత్య- అర్జున్ ఒక దగ్గర కూర్చోని మాట్లాడుకుంటూ ఉండగా.. నేహా చూసి శ్రీహాన్‌ని అడుగుతుంది. నిజం చెప్పు వారి మధ్య ఏం లేదా? అని. అందుకు శ్రీహాన్ వాడికైతే ఫీలింగ్స్ ఉన్నాయి. ఆమె మాత్రం అసలు దేకట్లేదు అంటూ ఉన్నది చెప్పాడు. నిజానికి అర్జున్ కల్యాణ్ ఎంత ట్రై చేసినా వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె క్లియర్‌గా అందరూ అన్నలే అనేసింది. ఇంక మనోడు కూడా ఆమె మీద ఏకాగ్రతని గేమ్ మీద పెడితే హౌస్‌లో ఉంటాడు.
తినే విషయంలో రేవంత్‌కి ఇంట్లో ఉన్న చంటి- సుదీపాలకు గొడవ జరిగింది. గతంలో ఒకసారి చంటి తన తిండి గురించి మాట్లాడాడని రేవంత్ శ్రీహాన్ వాళ్లతో చెబుతూ బాధపడ్డాడు. ఇప్పుడు తాజాగా సుదీపా తన తిండి గురించి మాట్లాడుతోందని అలిగాడు. నైట్ డిన్నర్ సమయంలో కేవలం గిన్నెలో పప్పు వేసుకుని నాకు ఫుడ్ వద్దు అంటూ వెళ్లిపోయాడు. శ్రీహాన్‌తో కూర్చొని “ఏంటో మనిషులు అనే వాళ్లు ఇలా తింటే కడుపునొప్పి వస్తుంది. కానీ, రేవంత్‌కి మాత్రం రావడం లేదు” సుదీపా అనిందని చెప్పాడు. ఆ విషయం మీద ఇద్దరికీ పెద్ద గొడవ జరిగింది. నన్ను మనిషి కాదు అని అన్నావ్ అంటూ రేవంత్ కేకలు వేయగా ఆ మాటలను సుదీపా ఖండించింది. తాను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, రేవంత్ మాత్రం ఆమె మాటలను వినిపించుకోలేదు. ప్రతి సీజన్లో ఒకరు మాత్రం ఇలా తినే విషయంలో టార్గెట్ అవుతూనే ఉంటారు.
శ్రీహాన్- ఇనయాల మధ్య మరోసారి గొడవ జరిగింది. కెప్టెన్సీ టాస్కులో పిరమిడ్లు కాపాడుకునే క్రమంలో ఫైమా చేత్తో టచ్ చేసిందని రేవంత్ తనని డిస్కాలిఫై చేశాడు. అప్పుడు ఇనయా సుల్తానా వెళ్లి శ్రీహాన్ కూడా అలా చేత్తో పట్టుకోవడం నేను చూశానంటూ రేవంత్‌కి ఫిర్యాదు చేసింది. రేవంత్ అది తాను చూడలేదని వెళ్లి శ్రీహాన్‌ని అడిగాడు నిజంగా పట్టుకున్నావా? చెప్పు అనగా అతను నేను అలా చేయలదేని చెప్పాడు. అదే విషాన్ని రేవంత్- ఇనయా సుల్తానా డిస్కస్ చేస్తున్న సమయంలో శ్రీహాన్ వచ్చి ఏ పిట్ట కూతలను నమ్మకు అని కామెంట్ చేశాడు. అందుకు ఇనయా ఉగ్రరూపం దాల్చింది. నన్ను పిట్ట అని ఎలా అంటావ్ అంటూ కేకలు వేసింది. శ్రీహాన్ తప్పుగా అనకపోయినా పిట్ట అనేది కొందరు తప్పుగానే తీసుకుంటారు. అయినా ఇనయా కూడా కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యిది. అలా హౌస్‌లో 18వ రోజు స్ట్రాటజీలు, గొడవలు, కేకలు, కొట్లాటలతో సాగిపోయింది.