‘బిగ్ బాస్ 6’లో ఇనయా సుల్తానా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ తో హౌసులోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ ముద్రని చెరిపేసుకుంది. బోల్డ్ గేమ్, ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. ఎంతమంది ఇబ్బందిపెడుతున్నా సరే అస్సలు భయపడకుండా పోరాడింది. హౌస్ మొత్తం కొన్ని వారాల పాటు ఈమెనే టార్గెట్ చేస్తూ, ప్రతిసారి ఎలిమినేషన్స్ కి పంపించినా సరే అస్సలు ధైర్యం కోల్పోలేదు. తాజా సీజన్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గతవారం ఇనయా ఎలిమినేట్ అయిపోయింది. డేరింగ్ మహిళగా ఫేమ్ సంపాదించి హౌస్ నుంచి బయటకొచ్చింది. ఇప్పటికే ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఇనయా పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు దీని గురించే డిస్కషన్ నడుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ అంటే ఓ డ్రామా. అందులో చివరివరకు పోరాడాలి. నిలబడాలి. దీన్ని ఇనయా ఫెర్ఫెక్ట్ గా చేసి చూపించింది. ప్రేమైనా, కోపమైనా, నవ్వైనా, ఏడుపైనా సరే అస్సలు దాచుకోకుండా వెంటనే చూపించేది. తోటి కంటెస్టెంట్ ఆర్జే సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్ కి చెప్పినా.. అతడికి హగ్గులిస్తూ, రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా భలే వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే ఆమె గేమ్ పై దృష్టి తగ్గించేసింది. దీంతో హోస్ట్ నాగార్జున వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో మళ్లీ గేమ్ పై ఫోకస్ పెట్టింది. ఓవైపు సూర్య కూడా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దీంతో ఇనయా తన దూకుడు మళ్లీ చూపించింది. రేవంత్ తర్వాత ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజీలో టాప్ లో ఉంటుంది. అలాంటి ఇనయాని 14వ వారం ఎలిమినేట్ చేశారు. అయితే ఈమెని బయటకు పంపేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఆమెది ఫేక్ ఎలిమినేషన్ అని కూడా అన్నారు.
మూడు నెలల బిగ్ బాస్ హౌసులో ఉన్న ఇనయా.. బయటకు రాగానే తన క్రష్ ఆర్జే సూర్యని కలిసింది. వీళ్లిద్దరూ ఫైనల్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేశారు. ఈ ఫొటో కూడా వైరల్ అయింది. ఇదిలా ఉండగా ఇనయాకు ఇప్పటికే పెళ్లి జరిగిందని టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల క్రితం ఇనయా తీసుకున్న ఓ ఫొటో సర్క్యూలేట్ అవుతుంది. అది ఆమె పెళ్లి ఫొటోనే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ 6 అనే పేరుతో ఉన్న ఓ అకౌంట్ యూజర్.. ఈ త్రోబ్యాక్ ఫొటోని షేర్ చేశాడు. ఇందులో ఇనయా, పెళ్లి కూతురి గెటప్ లో ముస్తాబై ఉంది. దీంతో అందరూ పెళ్లి ఫొటోనే అని ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు ఓ ఫొటో చూసి, ఎలా డిసైడ్ చేసేస్తారంటూ మరికొందరు నెటిజన్స్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు.
Lady Tiger #Inaya With her Male Tiger 🔥🔥 #BiggBossTelugu6 pic.twitter.com/f0kFxhufIa
— Unknownn (@Unknownhearrt) December 15, 2022