బిగ్ బాస్ షో ప్రారంభమవడం ఏమోగానీ, CPI నేత నారాయణ సీనులోకి ఎంటర్ అవుతారు. ఆ షోపై షాకింగ్ కామెంట్స్ చేస్తారు. ఇది గత కొద్ది సీజన్ల నుంచి జరుగుతూ ఉన్నదే. కాకపోతే నారాయణ వ్యాఖ్యలపై షోకి సంబంధించిన వారు ఎవరు స్పందించేవారు కాదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్ నాగార్జున- నారాయణ మధ్య పరోక్షంగా మాటల యుద్ధం జరిగింది. ముందు ముందు జరిగేలా కనిపిస్తోంది. అదంతా పక్కనబెడితే దీనిపై ఇప్పుడు నాగ్ కాస్త వివరణ ఇచ్చేంత వరకు వెళ్లింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ గత వారం మొదలైంది. మొత్తం 21 మంది హౌసులోకి అడుగుపెట్టారు. ఇందులో రియల్ కపుల్ మెరీనా-రోహిత్ కూడా ఉన్నారు. ఈ షో ప్రారంభమైన కొన్నిరోజుల్లోనే CPI నేత నారాయణ.. ‘అది బిగ్ బాస్ షో కాదని, బ్రోతల్ హౌస్ అని.. డబ్బు కోసమే నాగార్జున ఇదంతా చేస్తున్నాడు’ అని విమర్శించారు. దీనిపై డైరెక్ట్ గా స్పందించిన నాగ్.. శనివారం ఎపిసోడ్ లో కపుల్ రోహిత్-మెరీనాని గట్టిగా హగ్ చేసుకోమన్నాడు. అలా వాళ్లు చేస్తున్న టైమ్ లో ‘నారాయణ నారాయణ.. వాళ్లు పెళ్లయినవాళ్లు’ అని నాగ్ సెటైర్ వేశాడు.
దీంతో నాగ్.. ఈ కామెంట్స్ CPI నేత నారాయణని ఉద్దేశించే అన్నాడని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. దీనిపై తాజాగా స్పందించిన నాగ్.. ఓ ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ‘ఎవరైనా జోక్ వేస్తే ‘నారాయణ నారాయణ’ అంటాను. శనివారం ఎపిసోడ్ లో నవ్వించడానికే అలా అన్నాను. బిగ్ బాస్ గత రెండు సీజన్స్ లో ఇదే ఉంది. ఎవరినీ ఉద్దేశించి ‘నారాయణ నారాయణ’ అనడం లేదు’ అని నాగ్ చెప్పాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ చేయడం వరకే ఓకేగానీ.. పార్టిసిపెంట్ గా మాత్రం వెళ్లాలనుకోవట్లేదని నాగ్ అన్నాడు. నాగ్-నారాయణ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్ళు పతివ్రతలు ఎలా అవుతారు: CPI నారాయణ!
ఇదీ చదవండి: ‘బిగ్ బాస్’ విమర్శలపై పంచులు.. నాగ్ ‘నారాయణ’ జపం
ఇదీ చదవండి: నాగ్ కౌంటర్‌పై CPI నారాయణ రియాక్షన్.. నాగన్నా నాగన్నా అంటూ..!