బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోతాయి. అలా తెలుగు వారి మదిలో నిలిచిన షో “బిగ్ బాస్”. ప్రముఖ ఛానల్ స్టార్ మా వేదికగా ఈ షో ప్రసారమవుతోంది. గత 5 సీజన్లలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ “బిగ్ బాస్”. ఆదివారం ఈ షో ఘనంగా ప్రారంభం అయ్యింది. దీనికి వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జున వ్యవహారించనున్నరని మనకు తెలిసిందే. అయితే ఈసారి బరిలోకి దిగే వాళ్లలో చాలా మంది ఎవరికీ తెలియని వారే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఓ యువ నటుడు మాత్రం అందరిని ఆకర్షిస్తున్నాడు.. అతడు మరెవరో కాదు అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ 6 హౌజ్ లోకి అడుగు పెట్టాడు.
అర్జున్ కళ్యాణ్.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా వినిపిస్తోన్నపేరు. దానికి కారణం అతడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుబెట్టబోతుండటమే. ఇక అతడి బయోగ్రఫిలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరులో జన్మించాడు అర్జున్. అతడికి చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉండటంతో అటువైపుగా అడుగులు వేశాడు. తన చదువుల కోసం USకి వెళ్లాడు. అక్కడే కెంటికీ యూనివర్సీటిలో MS కంప్లీట్ చేశాడు. సినిమాలపై పిచ్చితో న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో మూవీ కోర్స్ కూడా పూర్తి చేశాడు. మూవీలపై పిచ్చి కాస్త పీక్స్ కు వెళ్లడంతో అక్కడి నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చాడు.

‘చిన్న సినిమా'(2013) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అదీ కాక తన ఫిల్మ్ కోర్స్ అనుభవంతో చిన్నా చితక షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ వచ్చాడు. కానీ అనుకున్నంత పేరు మాత్రం సంపాదించుకో లేకపోయాడు. అతడు నేను నా గర్ల్ ఫ్రెండ్(2016), మిస్సమ్మ(2021), నారీ నారీ నడుమ మురారీ (2022) సిరీస్ లు మాత్రం అర్జున్ కు మంచి పేరును తీసుకు వచ్చాయి. ఇక ఆహా వేదికగా రిలీజ్ అయిన ప్లే బ్యాక్ మూవీలో కళ్యాణ్ నటన ఆకట్టుకుంది. అదీ కాక ఇతడు ప్రేమమ్, వరుడు కావలెను, తాజాగా వచ్చిన పెళ్లికూతురు పార్టీ సినిమాల్లో కూడా నటించాడు.
అయితే గత సీజన్ విన్నర్ అయిన వీజే సన్నీ కూడా ప్రారంభంలో అండర్ డాగ్ గానే బరిలోకి దిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటున్నారు నెటిజన్స్. అప్పట్లో వీజే సన్నీ పెద్దగా ఎవరికీ తెలీదు. అయినా గానీ తనకంటూ హౌస్ లో ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు అని కొందరు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. తన యాటిట్యూడ్ ను ఎక్కడా తగ్గించు కోనంత వరకు అతడికి తిరుగులేదనే చెప్పాలి. అతడు ఎంత మేరకు అభిమానులను అలరిస్తాడో చూడాలి. మరి అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ కి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అర్జున్ కళ్యాణ్ ఇన్ స్టా ఐడి: iamarjunkalyan
