బిగ్ బాస్ తెలురగు సీజన్ 6.. ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఇప్పటికి హౌస్‌లో 10 మంది ఉండగా.. వారిలో 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో నుంచి ఈవారం మెరీనా అబ్రహాం ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే లీకులు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోకి ఒకే కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ జంటను.. ఆ తర్వాత విడదీశారు. ఇద్దరు వేరు వేరు కంటెస్టెంట్లే అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వారి ఆట బాగానే సాగుతోంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు సడెన్‌గా మెరీనాని ఎలిమినేట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ కూడా షాక్‌లో ఉన్నారు. అయితే అసలు మెరీనా ఎలిమినేట్ కావడానికి 5 కారణాలు ఏంటో చూద్దాం.
మెరీనా హౌస్‌లోకి వచ్చిన సమయంలో ఇద్దరూ ఒకటే కంటెస్టెంట్ కాబట్టి.. ఒకరు అందరితో కలిసి ఉంటే మెరీనా మాత్రం వంటలో హెల్ప్ చేస్తూ ఉండేది. కొన్నివారాల పాటు అదే పనిగా వంట చేయడంతో ఆమెకు ఆ ముద్ర వేసేశారు. తర్వాత అదే రీజన్ చూపించి ఆమెను నామినేట్ కూడా చేశారు. అయితే అందరూ ఒకళ్లే పని చేస్తుంటే వీళ్లు ఇద్దరు పని చేయాలి అనే లాజిక్‌ని వీళ్లు ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారు. రోహిత్‌తో పోలిస్తే ఆ విషయం మెరీనాకి బాగా మైనస్ అయ్యింది.
మొదట్లో కెప్టెన్సీ పోటీదారుల టాస్కుల్లో చురుగ్గా పాల్గొనడానికి మెరీనాకి అవకాశం దక్కలేదు. ఏ ఫిజికల్ టాస్కు ఉన్నా కూడా.. రోహిత్ ముందుగా పాల్గొనేవాడు. అయితే ఆ తర్వాత ఇద్దరినీ విడదీశిన తర్వాత మెరీనా ట్రై చేస్తున్నా కూడా ఆమెకు ఆ ఛాన్స్, లక్ కలిసిరాలేదు. ప్రేక్షకుల్లో మెరీనా అంటే ఫిజికల్ టాస్కులకు పనికిరాదు అని ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి అది మైనస్ అయ్యింది.
రోహిత్- మెరీనాకి దాదాపుగా ఒకటే ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరూ నామినేషన్స్ ఉన్నారు. అంటే ఫ్యాన్స్ ఓట్లను చీల్చాల్సి వస్తుంది. అంటే వారు వేసే 10 ఓట్లలో 5 మెరీనాకి, 5 రోహిత్ కు వేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల వారికి ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే వస్తోంది. ఇంకొందరు రోహిత్- మెరీనాలో ఎవరికి ఓటు వేస్తే బావుంటుంది అని బేరీజు వేసుకుంటూ కొన్నిసార్లు రోహిత్‌కే ఎక్కువ ఓటింగ్ పడుతూ వచ్చింది. అలా ఈసారికి మెరీనా ఎలిమినేట్ కాకతప్పలేదు.
మెరీనాకు మొదటి నుంచి మథర్ ఇండియా అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడూ ఎవరితోనూ అంతగా గొడవలు పెట్టుకోలేదు. ఎదుటివాళ్లు ఆమెను బాధపెట్టినా కూడా అంతగా రియాక్ట్ కాలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి విషయానికి రియాక్ట్ కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పనేంలేకపోయినా కూడా సరదాగా గొడవ పడాల్సి ఉంటుంది. కానీ, మెరీనా అలా చేయలేదు. చివర్లో కాస్త మార్పు కనిపించినా కూడా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అయితే సోషల్ మీడియాలో ఇంకో వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. శ్రీసత్య కోసమే మెరీనాని ఎలిమినేట్ చేశారని చెబుతున్నారు. నిజానికి ఓటింగ్ పరంగా శ్రీసత్య లీస్ట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పేరెంట్ ఎపిసోడ్ కోసం శ్రీసత్యతో అయితే ఫ్యామిలీ డ్రామా పండించవచ్చని.. మెరీనా అయితే ఎలిమినేట్ అయినా రోహిత్ కోసం వచ్చే ఛాన్స్ ఉందని భావించారని చెబుతున్నారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా వైరల్ అవుతోంది.