‘బిగ్ బాస్ 5 తెలుగు’ 12వ వారం ఎలిమినేషన్ జరిగిపోయింది. హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిపోయాడు. అందరూ షాక్ లో ఉన్నారు. బయట రవి కోసం నిరసలను జరుగుతున్న విషయం తెలిసిందే. తాను ఎలిమినేట్ అయ్యాక అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారో రవి లీక్ ఇచ్చాడని అభిమానులు ప్రచారాలు మొదలు పెట్టారు. స్టేజ్ పై ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అయ్యారో చెప్పిన రవి అక్కడే మాటల సందర్భంలో ఈ లీక్ ఇచ్చాడని చెప్తున్నారు.
బిగ్ బాస్ లో నాకు ఒక తమ్ముడు దొరికాడని యాంకర్ రవి చాలా సందర్భాల్లో చెప్పాడు అలాగే స్టేజ్ పై కూడా చెప్పాడు. అక్కడ మాట్లాడుతూ రవన్న నువ్వు ఉంటేనే బావుంటుందని చెప్పిన సందర్భంలో రవి ‘నేను ఇక్కడ ఉంటనే నువ్వు విన్నర్ అవుతావు’ అన్నాడు. అది యాధృచ్ఛికంగా అన్న మాటే అయినా కూడా అందులో చాలా అర్థం ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉండి 24 గంటలు చూసింది తాను కాబట్టి అలా అనుకుండానే అలా అనేశాడని కొందరు అంటున్నారు.
యాంకర్ రవి- సన్నీ రిలేషన్ బిగ్ బాస్ హౌస్ లో అంతగా కనిపించింది లేదు. కానీ, వాళ్లు ఎమోషనల్ గా చాలా మంచి బాండింగ్ కనిపించింది ఎలిమినేషన్ సమయంలో. అయితే యాంకర్ రవి.. సన్నీని ఎంతగానో పొగడటం చూశాం. బయట నిన్ను నేను ఎత్తుతాను అంటూ మాటిచ్చాడు. తన కోసం పటాకాలు కాలుస్తానని చెప్పాడు. అంతేకాకుండా బయట వీజే సన్నీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సన్నీనే బిగ్ బాస్ విన్నర్ అంటూ ఇప్పటికే చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రవి ఇచ్చిన ఎలివేషన్ వాటికి బలం చేకూర్చినట్లు అయ్యింది.
ఇదీ చదవండి: రవిని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారా?
ఏదేమైనా ఇంకో 20 రోజుల్లో విన్నర్ ఎవరు అన్నది అధికారికంగా తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ షోలో బయట వినిపించే టాక్ లోపల పనిచేయదు అని చాలా సందర్భాల్లో చూశాం. అందుకు ముఖ్య ఉదాహరణ రవి ఎలిమినేషన్. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ విన్నర్ ఎవరి మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.