‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఎవరు ఎలా లాభ పడినా.. సిరి హన్మంత్ మాత్రం కాస్త నెగెటివిటీని మూట కట్టుకుంది. సిరి- షణ్ముఖ్ రిలేషన్ సీజన్ మొత్తం హట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా మీ ఇద్దరి మధ్య ఏముంది? ఇదే ప్రశ్న ఎదురవుతోంది. అలాంటి ప్రశ్నలకు సిరి చాలా వరకు ఎంతో ధైర్యంగా సమాధానమిస్తూ వస్తోంది. అయినా ఇంత నెగెటివ్ గా పోట్రే అయ్యిందని తెలీదు అంటూ సిరి చెప్పిన మాటలను సైతం ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మిగిల్చిన గాయాలను రివీల్ చేసింది సిరి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ 5 విన్నర్ VJ సన్నీ ప్రైజ్ మనీతో ఏం చేయబోతున్నాడంటే?
అదే ఐస్ టాస్కు గుర్తింది కదా? అప్పుడు ఎక్కవసేపు అలానే ఐస్ కాళ్లు పెట్టడం వల్ల ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత షణ్ముఖ్ దగ్గరుండి చూసుకున్నాడు. సిరి టాస్కుల్లో ఆమెకు బదులు షణ్ముఖ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది అంత ఏముందని సిరి అలా చేస్తోంది? అంటూ ప్రశ్నించారు. కానీ, ప్రస్తుతం ఆ గాయాలను చూస్తుంటే సిరి ఎంత బాధ అనుభవించి ఉంటుందని బాధపడుతున్నారు.
సిరి పాదాలు రెండూ పాలిపోయినట్లు.. బాగా పగిలినట్లుగా కనిపిస్తున్నాయి. నెప్పి తగ్గినా కానీ, ఆ గుర్తులు మాత్రం పోయినట్లు లేదు. సిరి కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. బాధ పోయినా కూడా ఆ గుర్తులు అలాగే ఉన్నాయి అంటూ సిరి కూడా అభిప్రాయపడింది. సన్నీ చాలా అగ్రెసివ్ గా ఆడటంతో సిరి అసలు ఐస్ లో నుంచి కాళ్లు తీయలేదు. కాసేపటి తర్వాత సన్నీ అక్కడ లేకపోయినా సిరి కావాలనే కాళ్లు తీయలేదు. ఐస్ టాస్కు విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో కొత్త రచ్చ! ఆ కులపోళ్ల ఓట్లతోనే వీజే సన్నీ గెలిచాడా?