‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఫ్యామిలీ ఎమోషన్స్ ఒక కొలిక్కి వచ్చాయి. అందరూ గేమ్ పై ఫోకస్ పెట్టారు. కుటుంబ సభ్యుల చెప్పిన విషయాలను మెదడుల్లో బాగా నాటుకున్నారు. ఇక నుంచి ఉన్న 3 వారాలు కొత్త తప్పులు చేయకుండా.. పాత తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాజల్ కుటుంబంతో మొదలైన ఆ జర్నీ.. షణ్ముఖ్ తల్లి రాకతో ముగిసింది. షణ్ముఖ్ తల్లి చాలానే విషాలు చెప్పారు. షణ్ముఖ్ లో కొత్త ఉత్సాహం నింపారు. అసలే సిరి తల్లి మాటలతో కుంగిపోయిన షణ్నుకు కాస్త ఊరట లభించింది. ‘పొద్దున్నే లేచి కాస్త రెండు స్టెప్పులేసి.. గుడ్ మార్నింగ్ అని చెప్తే మాకు కాస్త ఆనందంగా ఉంటుంది’ అని షణ్ముఖ్ తల్లి చెప్పడం అందరినీ నవ్వించింది.
షణ్ముఖ్ ని చూసి తల్లి ఎంతో గర్వపడింది. ఇంకా నేను గర్వపడేలాగా టైటిల్ తీసుకుని రా అంటూ ఆశీర్వదించారు. గేమ్ గురించి చాలా విషయాలు చెప్పారు. టాస్కుల్లో ఎంతో స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడంటూ మెచ్చుకున్నారని షణ్ను చెప్పుకున్నాడు. ‘నీ గేమ్ నువ్వు ఆడు. మేము అంతా చూస్తున్నాము. నువ్వేంటో మాకు తెలుసు’ అంటూ ధైర్యం చెప్పారు. ఇంతలో దీప్తీ ఎలా ఉంది అంటూ షణ్ముఖ్ అడిగాడు. అందుకు తల్లి కలిశాను.. బానే ఉందని చెప్పుకొచ్చింది. మాట నమ్మని షణ్ముఖ్ ఒట్టు వేయాలని కోరతాడు. ‘తల్లి అబద్ధం చెబుతుందా? ఒట్టు దీప్తీ కూడా బానే ఉంది. అవేం ఆలోచించడం లేదు. నాకులాగే తను కూడా అర్థం చేసుకుంది. నువ్వు అవేం మనసులో పెట్టుకోకు. గేమ్ పై ఫోకస్ పెట్టు. ఎవరి కోసం నువ్వు త్యాగాలు చేయకు’ అంటూ షణ్ముఖ్ తల్లి చెప్పుకొచ్చింది. ఆ మాటలు విని హమ్మయ్య అంటూ షణ్ముఖ్ గట్టిగా గాలి పీల్చుకున్నాడు.
ఇప్పటి వరకు బయట వస్తున్న మాటలకు షణ్ముఖ్ తల్లి నుంచి ఒక ఆన్సర్ దొరికిందనే చెప్పుకోవాలి. మరి దీప్తీ సునైనా నిజంగానే లైట్ తీసుకుందా? లేక అసలు విషయం ఇంకేమైనా ఉందా? అది చెబితే తన కుమారుడి గేమ్ పాడవుతుందని చెప్పలేదా? అనేది తెలియాల్సి ఉంది. షణ్ముఖ్ తల్లి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.