‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్లు హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బయట వాళ్ల సపోర్టర్స్ మాత్రం వారికి ఓట్స్ వేయించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. హౌస్ లో చివరకు ఐదుగురే మిగిలేసరికి బిగ్ బాస్ కూడా వారిని ఈ టూ డేస్ బాగా ఎటర్ టైన్ చేస్తున్నాడు. ఈ సీజన్ ఎప్పటికీ హాట్ టాపిక్ సిరి- షణ్ముఖ్ రిలేషనే. ఈ విషయంలో శ్రీహాన్ ఓపెన్ కామెంట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఈ సందర్భంలో బిగ్ బాస్ హౌస్ లో గతంలో షణ్ముఖ్ చేసిన కామెంట్స్ మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ తన పాత ఫ్రెండ్ పై నోరు పారేసుకోవడానికి కారణం ఒక్కటే. అతని ఒపీనియన్ ను బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పడం.
ఇది కూడా చదవండి: మొహమాటం వదిలేసిన షణ్ముఖ్.. నువ్వు నాకు పడిపోయావే అంటూ
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సమయంలో శ్రీహాన్ లెక్కల ప్రకారం టాప్-5 పెట్టమన్నప్పుడు సన్నీని టాప్ లోఉంచాడు. ఆ తర్వాత షణ్ముఖ్ ఫొటో ఉంచాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న షణ్ముఖ్ సందర్భం వచ్చినప్పుడల్లా అతనిపై కామెంట్స్ చేశాడు. ‘నేను నిన్ను ఇంతలా ప్రొటెక్ట్ చేస్తుంటే మీ చోటు ఏమో ఆ సన్నీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. మీ అమ్మేమో హగ్ లు అంటుంది’ అంటూ సిరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల కూడా సన్నీతో సిరికి చిన్నపాటి గొడవ జరిగిన సందర్భంలోనూ షణ్ముఖ్ మళ్లీ అదే మాట అన్నాడు. ‘వెళ్లి చెప్పు మీ చోటుకి ఇలాంటి వాడిని టాప్ లో పెట్టావు. బాగా చూసుకునే వాడినేమో సెకండ్ లో పెట్టావ్. ఇలా చేశాడు.. ఇలా అన్నాడు అని వెళ్లాక చెప్పు’ అంటూ షణ్ముఖ్ గట్టిగానే కామెంట్స్ చేశాడు. శ్రీహాన్ కూడా ఓపెన్ అయిన సందర్భంలో ఈ ఓల్డ్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ శ్రీహాన్ గురించి అలా మాట్లాడటం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.