‘బిగ్ బాస్ 5 తెలుగు’ షో ముగిసిన తర్వాత.. కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు? వారికి ఎలాంటి అవకాశాలు దక్కాయి ఇప్పుడు ఇదే అందరు వెతుకున్న ప్రశ్నలు. కానీ, షణ్ముఖ్ విషయంలో మాత్రం దీప్తీ సునైనాకు కోపం తగ్గిందా? వాళ్లిద్దరూ కలుస్తారా? సిరి- షణ్ముఖ్ ఫ్రెండ్స్ లా కంటిన్యూ అవుతారా? ఇవే ప్రశ్నలు. అయితే తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి తన అభిమానులతో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం షణ్ముఖ్ ఇచ్చిన ఆన్సర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా లైవ్ లోకి వచ్చిన చాలా మంది వారిద్దరి రిలేషన్ గురించే ప్రశ్నలు వేశారు. అందుకే షణ్ముఖ్ కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు. ‘మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు కామనే. లైవ్ లో యాడ్ చేద్దామంటే నన్ను బ్లోక్ చేసింది. నాకు కోపం వస్తే అలుగుతాను, అరుస్తాను. తను మాత్రం కోపం వస్తే మాట్లాడదు. బ్లోక్ చేస్తుంది. నేనే వెళ్లి కలుస్తాను.. తను ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉందో తెలీదు. కలిసి మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది. ఫ్యాన్స్ ఎవరు వరీ కావొద్దు. నేను దీపూని వదిలిపెట్టను. మా ఇద్దరికీ ఏమీ కాదు. ఎవరూ టెన్షన్ పడకండి’ అంటూ వారి రిలేషన్ కి ఎలాంటి ఢోకా లేదని భరోసా కలిగించాడు.
మరోవైపు నెక్ట్స్ ప్లాన్స్ ఏంటని ప్రశ్నించగా.. ‘నెక్ట్స్ వెబ్ సిరీసా? మూవీనా? ఓటీటీనా? క్లారిటీ లేదు. అంతా మిక్సప్ అయిపోయింది. న్యూఇయర్ వరకు కాస్త గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆలోచిస్తాను’ అంటూ ఫ్యూచర్ గురించి కూడా ఓ హింట్ ఇచ్చి వదిలేశాడు. షణ్ముఖ్ పై దీప్తీ సునైనా కోపం తెచ్చుకోవడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.