‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. హౌస్ లో చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ జశ్వంత్ అయ్యాడు. కెప్టెన్ అవకాశాన్ని కోల్పోయి హౌస్ లో ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయిననందుకు ప్రియాంక సింగ్ చాలానే బాధ పడింది. హౌస్ లో ఒక రేంజ్ లో సీన్ కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత అంతా సద్దుమణింగింది. ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అవును ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇది చాలా కష్టమైన ప్రశ్నే. ఎందుకంటే అక్కడి వరకు రాగలిగారంటే వారి గేమ్, వారి ఫాలోయింగ్ ని బట్టే అది సాధ్యమైంది. కానీ పర్ఫార్మెన్స్, ఫాలోయింగ్ ప్రకారం లిస్టులో లాస్ట్ ఉన్న సభ్యులు ఇద్దరు ఒకరు ఆర్జే కాజల్, ఇంకొకరు ప్రియాంక సింగ్. వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో పరిశీలిద్దాం.
సపోర్ట్ పరంగా చూసుకుంటే కాజల్ కు తెలుగు సీరియల్ ఆర్టిస్టులు, సింగర్స్, కొందరు సినిమా వాళ్లు కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంక ప్రియాంక్ సింగ్ కు మెగా బ్రదర్ నాగబాబు, జబర్దస్త్ వాళ్లు సపోర్ట్ చేస్తున్నారు. హౌస్ లో తన పర్ఫార్మెన్స్ తో ఇంకాస్త ఫాలోయింగ్ పెంచుకుంది. గత కొన్ని వారాల్లో ఓటింగ్ లో కాజల్ లీస్ట్ లో ఉన్నా కూడా గతవారం మాత్రం చాలా ముందే సేవ్ అయ్యింది. ప్రియాంక సింగ్ మాత్రం యానీ మాస్టర్ కంటే ముందు సేవ్ అయ్యింది. అంటే లీస్ట్ లో సేవ్ అయిన పర్సన్ ప్రియాక సింగ్. అలా చూసుకుంటే ఈ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. మరోవైపు కాజల్ కూడా హౌస్ లో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితులు ఇంతకముందే వచ్చాయి కాబట్టి. కాజల్ కి కూడా అవకాశాలు ఎక్కువున్నాయి.
కాజల్ ఎలిమినేట్ అయ్యింది అనుకుందాం. అలాంటప్పుడు సన్నీ దగ్గరున్న ఎవాక్యువేషన్ పాస్ ను వినియోగించి కాపాడే అవకాశం ఉంది. ఎందుకంటే సన్నీకి ఆ పాస్ వచ్చిందే కాజల్ వల్ల. ఆ పాస్ ను తన కోసమే కాదు.. అతని మిత్రుల కోసం కూడా వాడుకోవచ్చు. సో సన్నీ ఆ పాస్ ను ఉపయోగించి కాజల్ ను కాపాడే అవకాశం ఉంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీ భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.