‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంట్లోని సభ్యులు అందరూ వారి గేమ్ పై ఫోకస్ పెట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలను బాగా చెవికెక్కించుకుని ఆటపై శ్రద్ధ పెట్టారు. షణ్ముఖ్ కు తల్లి కూడా అదే చెప్పింది గేమ్ పై ఫోకస్ పెట్టు అని. ఇక్కడ అందరూ షణ్ముఖ్ కోసం దీప్తీ సునైనా వస్తుందని ఎదురుచూశారు. షణ్ముఖ్ సైతం దీప్తీ వస్తుందేమో అనుకున్నాడు. కానీ, తల్లి రావడంపై కూడా ఎంతో ఆనంద పడ్డాడు. అయితే అందరూ ఇప్పుడు అసలు దీప్తీ ఎందుకు రాలేదు అని మాట్లాడుతున్నారు. రాకపోవడాన్ని పలు అంశాలకు జోడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు దీప్తీ సునైనా రాకపోవడానికి కారణాలు ఇవే అయిఉండొచ్చు.
దీప్తీ సునైనా వస్తుంది సిరితో రిలేషన్ పై షణ్ముఖ్ ను కడిగిపారేస్తుంది అంటూ చాలా మంది ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. షణ్ముఖ్ తల్లి వచ్చి చాలా సింపుల్ గా గేమ్ ఎలా ఆడాలో చెప్పి వెళ్లింది. దీప్తీ సునైనా రాకపోవడానికి ప్రధాన కారణం.. తల్లి తన కుమారుడిని చూడలనుకోవడం. మరొకటి హౌస్ లోకి రావాలంటే ముందు ఒక మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాలి. దీప్తీ సునైనాకు ఉండే బిజీ షెడ్యూల్ లో అది కష్టమనే చెప్పాలి. ఈ రెండు ప్రధాన కారణాలతోనే దీప్తీ సునైనా రాకపోయి ఉండొచ్చు. దీప్తీ రాకపోయినా ఆమె మనసులోని మాటలను షణ్ముఖ్ తల్లికి చెప్పి పంపించింది. గేమ్ ఫోకస్ పెట్టాలని మరీ మరీ కోరింది. అయితే దీప్తీ సునైనా నాగార్జునతో కలిసి స్టేజ్ పై షణ్ముఖ్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది అని కూడా వినిపిస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. దీప్తీ సునైనా రాకపోవడం కారణం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.