బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 5 తెలుగు చివరకి దశకు చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. తన అందంతో అందర్నీ ఆకర్షించింది.. మంచితనంతో మనసుల్ని దోచుకుంది.. ట్రాన్స్‌జెండర్ అని చెబితేగానీ తెలియని ప్రియాంక సింగ్ మాట, మనసు ఎదుటి వారికి ఇచ్చే గౌరవం అన్నీ ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఉండడానికి కారణమయ్యాయి అని అంటున్నారు. ఇన్ని రోజులు ఆమెని ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. చివరి దశలో ఆమె ఎలిమినేషన్ కావడం ఒకింత బాధాకరమైన విషయం అంటున్నారు ప్రియాంక ఫ్యాన్స్. ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ 3 లో ట్రాన్స్ జెండర్ అంటే భయపడేట్టు చేసింది తమన్నా సింహాద్రి. ఆమె ప్రవర్తనతో ఛీ కొట్టినవాళ్లు చాలామందే ఉన్నారు. వచ్చిన కొద్ది రోజులకే అందరితో గొడవ పెట్టుకొని నానా రచ్చ చేసి ఎలిమినేషన్ అయ్యింది సింహాద్రి. అయితే సీజన్ 5లో ప్రియాంక (సాయి తేజ) అనే టాన్స్ జెండర్‌ని కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు.
తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌లోనే గ్లామర్ బ్యూటీగా అవతరించిన ప్రియాంక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. బిగ్ బాస్ లో టాస్క్ పరంగా బీభత్సం ఏమీ సృష్టించకున్నా.. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా, ఎవరితో గొడవ పడకుండా సేఫ్‌గా గేమ్ ఆడింది. అందుకే ప్రియాంక సింగ్ ఇన్నిరోజు బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగింది అనేవారు లేకపోలేదు. పైగా ఆమెతో పోలిస్తే మిగతా కంటెస్టెంట్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే.. ఒకానొక సమయంలో తాను ఎలిమినేట్ అయిపోతానేమోనని భయపడింది. కానీ అందుకు భిన్నంగా 90 రోజులు హౌస్‌లో ఉంది. తాను ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి ప్రియాంక ఔట్ అన్న పదాలు వినిపించేవి.. కానీ అనూహ్యంగా ఓటింగ్ తో సేఫ్ అవుతూ వచ్చింది.
ఇక బిగ్ బాస్ లో వచ్చిన వాళ్లంతా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు.. పర్సనల్ విషయాలపై కామెంట్స్, వరస్ట్ బిహేవియర్ తో చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పించారు.. ఆ తప్పే వారందరినీ ఎలిమినేష్ అయ్యేలా చేసింది. ఆ తప్పులే ప్రియాంక సింగ్ కి బాగా కలిసి వచ్చాయని.. ఈ క్రమంలోనే ఒన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రియాంక అనుకుని ఆమెకు ఓట్లు వేసారు.. అలా ప్రియాంక నామినేషన్ నుంచి గట్టెక్కింది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఇన్ని రోజులు హౌస్‌లో ఉంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ప్రియాంక వెళ్లి పోవడం ఒకరకంగా హౌస్‌మేట్స్‌ని బాధించింది. బిగ్ బాస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.