తెలుగులో కింగ్ నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 5వ సీసన్ విజయవంతంగా రన్ అవుతోంది. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న సభ్యులు.. షో ముగిసేలోపు మంచి ఫేమ్ తెచ్చుకుంటారు లేదా కాంట్రవర్సీలతో బయటపడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ చివరిదశకు చేరుకోవడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో సింగర్ శ్రీరామ్ ఆల్రెడీ ఫైనల్ కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత స్థానాలలో యూట్యూబర్ షణ్ముఖ్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, యూట్యూబర్ సిరి ఉన్నారు.
బిగ్ బాస్ విజేత ఎవరో తెలియడానికి కేవలం రెండు వారాలే ఉండటంతో.. ఇంటి సభ్యులకు సంబంధించి కొన్ని క్రేజీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిరి కారణంగా షణ్ముఖ్ రియల్ లైఫ్ లవ్ ట్రాక్ అటకెక్కేలా ఉందని టాక్. ఎన్నిసార్లు వద్దని చెప్పినా బిగ్ బాస్ హౌస్ లో సిరి.. షణ్ముఖ్ తో సన్నిహితంగా మెలగడం చూసి దీప్తి సునైనా తట్టుకోలేకపోతుందట. ఇదివరకే హోస్ట్ నాగ్, షణ్ముఖ్ తల్లి వార్నింగ్ ఇచ్చినప్పటికీ సిరి బిహేవియర్ మారకపోవడంతో.. అటు షణ్ముఖ్ – దీప్తి ఫాన్స్ లో సందేహాలు కమ్ముకున్నాయి.
ఎందుకంటే.. హౌస్ లో షణ్ముఖ్ – సిరిల హగ్గులు, రొమాన్స్ ఆగడం లేదు. సో షో ముగిసే సరికి వీరి లవ్ స్టోరీకి శుభం కార్డు పడనుందని నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ షణ్ముఖ్ – దీప్తి లవ్ ట్రాక్ ఇప్పటిది కాదని.. సిరి ఎంత ట్రై చేసినా వారి లవ్ బ్రేక్ అవ్వదని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. అలాగే దీప్తి కూడా సోషల్ మీడియా ద్వారా షణ్ముఖ్ కి సపోర్ట్ చేస్తూనే ఉంది. కాబట్టి వీరి లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతుందా లేదా? అనే విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలపండి.