‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో మళ్లీ నామినేషన్స్ తో వేడి రాజుకుంది. వారమంతా కూల్ గా ఉన్న ఇంట్లోని సభ్యులు ఏ రీజన్ చెప్పాలా అనుకుని ఏదొకటి చెప్పి రచ్చ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే షణ్ముఖ్ కు ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాష ఏదైనా.. హగ్గు అనే మాట వినిపిస్తే చాలు.. వెన్నులో వణుకుపుడుతోంది. హగ్గు విషయంలో బిగ్ బాస్ హౌస్ లో కానీ, బయట కానీ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సిరి దగ్గరకు వస్తోందంటేనే షణ్ముఖ్ జడుసుకుంటున్నాడు అనడంలో సందేహమే లేదు.
సిరి తల్లి వచ్చి చెప్పింది.. షణ్ముఖ్ తల్లి, దీప్తీ సునైనా ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. శ్రీహాన్ వచ్చి ఎందో బాధగా మాట్లాడాడు.. ఇన్నీ చూసి సిరి మళ్లీ వెళ్లి షణ్ముఖ్ జశ్వంత్ ను హగ్ చేసుకుంది. ఆ హగ్గులు హద్దులు దాటుతున్నాయన్నదే అందరి వాదన. కానీ, సిరిలో మాత్రం మార్పు కనిపిచడం లేదు. మొదటి రెండు రోజులు కాస్త మారినట్లే ఉన్నా మళ్లీ అదే ధోరణి. షణ్ముఖ్ వద్దు అంటున్నా కూడా బలవంతంగా లేపి మరీ హగ్ చేసుకుంది. అది ఫ్రెండ్లీ హగ్గే అంటూ చెప్పింది. మళ్లీ మీ అమ్మ నన్ను అంటారు అంటున్నా కూడా.. మా మమ్మీ అర్థం చేసుకుంటుందిలే. ఇది ఫ్రెండ్లీ హగ్గే అంటూ గాలికి కూడా చోటివ్వకుండా హగ్ చేసుకుంది.
అందరినీ వదిలి ఇన్ని రోజులుగా ఒకే దగ్గర ఉన్నప్పుడు వారి ఎమోషన్స్, వారి మెంటల్ స్టేటస్ ను మనం తప్పు పట్టకూడదు. కానీ, అలా వద్దు వద్దు బయటకు ఇంకోలా వెళ్తోంది అని చెప్పినా కూడా సిరి అలా చేయడం ప్రేక్షకులకు నచ్చడం లేదు. సోషల్ మీడియాలోనూ ఇదే ప్రస్తావన. సిరి హగ్గుల విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.