‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో కంటెస్టెంట్లు చివరి వారాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ టాస్కులు పెట్టి స్పెషల్ గిఫ్ట్ లతో బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఆఖరి వారంలో హౌస్ లో గొడవలు పెద్దగా జరగలేదు. కానీ, మళ్లీ ఆ ఇంటెన్సిటీ క్రియేట్ అయ్యింది. హౌస్ మొత్తం సిరి- సన్నీ కేకలతో హోరెత్తి పోయింది. నువ్వెవరంటే నువ్వెవరంటూ ఫైర్ అయి పోయారు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు. వేలు చూపించుకంటూ ఓ రెచ్చిపోయారు. మధ్యలో ఎప్పటిలాగే మానస్ సన్నీ లాక్కెళ్లాడు. షణ్ముఖ్ మాత్రం ఈసారి జోక్యం చేసుకోలేదు. లెట్ హర్ హ్యాండిల్ అనుకుని కూర్చున్నాడేమో.
ఇది కూడా చదవండి: మొహమాటం వదిలేసిన షణ్ముఖ్.. నువ్వు నాకు పడిపోయావే అంటూ
అసలు ఏం జరిగిందంటే.. ఈ సీజన్ లో గతంలో ఆడిన టాస్కులను బిగ్ బాస్ మళ్లీ ఇస్తున్నాడు. అలాగే సిరి, సన్నీ, షణ్ముఖ్ లకు బ్యాటిల్ రోప్స్ టాస్క్ ఇచ్చాడు. అందులో తాళ్లను ఎక్కువసేపు ఎవరైతే కదుపుతూ ఉంటారో వాళ్లే విజేతగా నిలుస్తారు. ముగ్గిరిలో సిరి ముందుగా తప్పుకుంది. పక్కన కూర్చుని ఎప్పటిలాగే షణ్ముఖ్ కు సపోర్ట్ చేస్తోంది. మధ్యలో సన్నీ అసలు బాగా ఆడట్లేదంటూ కామెంట్ చేసింది.
అక్కడితో అసలు వివాదం మొదలైంది. గేమ్ లో విన్నర్ అయ్యాక సన్నీ మళ్లీ అలాగే అంది.. సరిగ్గా ఆడలేదని. అందుకు సన్నీ నువ్వు ఓడిపోయావు అన్నాడు. అందుకు సిరి సీరియస్ అయ్యింది. ఓడిపోయావు అని ఎలా అంటావ్ అంటూ కేకలు వేసింది. కాసేపటి తర్వాత మళ్లీ సిరి దగ్గరకు వెళ్లి సన్నీ మాట్లాడే ప్రయత్నం చేయగా.. సిరి అస్సలు తగ్గలేదు. ఓడిపోయావ్ అనడం జోక్ కాదు అంటూ సీరియస్ అయ్యింది. ఇంక మాటా మాటా పెరిగి ఇద్దరూ కేకలు వేసుకున్నారు.
ఈ మొత్తం సీన్ లో సిరినే కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆ సీన్ అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. సీజన్ మొత్తంలో సిరి- సన్నీ వార్ నడుస్తూనే ఉంది. వీరిద్దరిని చూస్తుంటే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే అయిపోయాక కూడా వీళ్లు కూల్ అయ్యేలా లేరు. అదే జరిగితే వీళ్ల గిల్లిగజ్జాలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మాత్రమే తీరేలా ఉన్నాయి. సిరి- సన్నీ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.