‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఆఖరి వారంలోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్స్ కు ఓట్లు వేయించేందుకు కుటుంబ సభ్యులు, టీమ్లు చాలా కృషి చేస్తున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్ కోసం ఎప్పటి నుచో సోషల్ మీడియాలో కాంపైన్ చేస్తున్న ప్రియురాలు దీప్తీ సునైనా హేటర్స్ కు తన స్టైల్ లో రిప్లై ఇచ్చింది. షణ్ముఖ్ పై బయట నెగెటివిటీ పెరిగిపోతోందన్న భావనతో ఇలా కామెంట్ చేసినట్లు చెబుతున్నారు. షణ్ముఖ్ ఎలాంటి వాడో చెబుతూ.. అతనికి ఓట్లు వేయాలంటూ కోరింది దీప్తీ సునైనా.
‘బిగ్ బాస్ లో షణ్ముఖ్ ను చూస్తూ ఒక కంక్లూజన్ కు రాకండి. బిగ్ బాస్ ఒక షో మాత్రమే. షణ్ముఖ్ ఒక మంచి వ్యక్తి. అతనికి చేయాలనిపించింది చేయనివ్వండి. నిర్ణయాన్ని షణ్ముఖ్ కు వదిలేయండి. మీ అంచనాలు అందుకోవాలని కోరుకోకండి. షణ్ముఖ్ ను అతనిలా ఉండనివ్వండి. ఎవరిపై ధ్వేషాన్ని పెంచుకోకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ను మీరు సపోర్ట్ చేయండి. నేను షణ్ముఖ్ ను సపోర్ట్ చేస్తున్నా ఇప్పటికీ.. ఎప్పటికీ. షణ్ముఖ్ ని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నా’ అంటూ దిప్తీ సునైనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
కేవలం బిగ్ బాస్ చూసి షణ్ముఖ్ ను ధ్వేషించకండి.. ఓటు వేసి గెలిపించండి. నేను ఎప్పటికీ షణ్ముఖ్ నే సపోర్ట్ చేస్తా అంటూ దీప్తీ సునైనా చెప్పుకొచ్చింది. ఈ పోస్టు ద్వారా రెండు విషయాలు తేటతెల్లమయ్యాయి. ఒకటి దీప్తీ సునైనా షణ్ముఖ్ గెలవటం కోసం గట్టిగా కృషి చేస్తోంది. రెండు షణ్ముఖ్- దీప్తీ సునైనా విడిపోతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. దీప్తీ సునైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.