‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో మామూలు ట్విస్టులు కాదు అసలు. అందరూ ఎలిమినేట్ అవుతుందనుకున్న ప్రియాంక సేవ్ అవ్వడం, అందరూ సేవ్ అనుకున్న యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం మామూలుగా లేదు. అయితే స్టేజ్ పై కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి చాలానే ఉత్సాహాన్ని నింపారు. అది ఇంట్లోని సభ్యుల్లో కనిపిస్తోంది కూడా. ముఖ్యంగా దీప్తీ సునైనాను చూసిన తర్వత షణ్ముఖ్ లో వచ్చి ఉత్సాహం అంతా ఇంతా కాదు. అసలు ఎవరు పట్టుకోలేకపోతున్నారు. అక్కడ స్టేజ్ పై జరిగిన ఒక ఘటనను సోషల్ మీడియాలో ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. షణ్ముఖ్ సెకెండ్ ప్లేస్ ఉన్నాడని దీప్తీ హింట్ ఇచ్చింది అనేది ఆరోపణ. అందుకు దీప్తీ సునైనా తన ఇన్ స్టా స్టోరీలో చురకలు అంటించింది.
స్టేజ్ పై షణ్ముఖ్ తో మాట్లాడే సమయంలో దీప్తీ మైక్ ను రెండు వేళ్లతో పట్టుకుంది. మైక్ పై రెండు వేళ్లు కనిపిస్తున్నాయి. అందుకు ఆమె షణ్ముఖ్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నాడని హింట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అందుకు దీప్తీ సునైనా స్పందిస్తూ.. ‘నీ బొందరా నీ బొంద.. నేను ఎప్పుడూ అలాంటి చిల్లర పనులు చేయను. షణ్ముఖ్ విషయంలోనే కాదు నా లైఫ్ లో అసలు చేయను. షణ్మునే నాకు విన్నర్’ అంటూ గట్టిగానే వడ్డించింది.
అయితే అసలు దీప్తీ సునైనా చేతిలో షణ్ముఖ్ సేఫ్ ఆ.. అన్ సేఫ్ ఆ చెప్పేందుకు పెట్టిన కార్డు ఉంది. అది ఉందికాబట్టే రెండింటిని కలిపి అలా పట్టుంకుంది. దానికి కాస్త అత్యుత్సాహం సోషల్ మీడియాలో ప్రదర్శించి.. చివరికి చివాట్లు తిన్నారు. దీప్తి సునైనా రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.