‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో గేమ్ చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. అందరూ మైండ్ క్లియర్ చేసుకుని గేమ్ పై దృష్టి పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఇంట్లోని సభ్యుల్లో చాలా ఉత్సాహం పెరింగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాంకర్ రవి.. భార్య నిత్య కుమార్తె చేసిన అల్లరి, హంగామానే వైరల్ అవుతోంది. రవి భార్య అందరితో ఎంతో బాగా మాట్లాడింది. రవికి కూడా చాలా విషయాలు చెప్పింది. అతను ఎంతో బాగా ఆడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
రవికి బిగ్ బాస్ హౌస్ లో చాలానే పేర్లు పెట్టారు. ఒకరు గుంటనక్క అనగా.. మరొకరు బకరా అన్నారు. ఇంట్లోని సభ్యులు అయితే ఇన్ఫ్లూఎన్సర్ అంటూ పేరు పెట్టారు. అయితే ఈ విషయంపై నిత్యా ప్రస్తావించింది. ‘మీరు రవికి ఇన్ఫ్లూఎన్సర్ అని పేరు పెట్టారు. కానీ, అతనికి అంత సీన్ లేదు’ అంటూ రవి గాలి తీసేసింది. రవికి నువ్వు మంచి బ్రదర్ అంటూ షణ్ముఖ్ కి క్లారిటీ ఇచ్చింది. ఆ సందర్భంలోనే ఈ విషయం చెప్పింది. ‘మీరు రవి గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఇన్ఫ్లూఎన్స్ చేసే అంత లేదు అక్కడ’ అంటూ చెప్పేసింది. అందుకు షణ్ముఖ్ ‘అంత సీన్ లేదంట అక్కడ.. మనమే ఎక్కువగా ఊహించుకుంటున్నాం. అక్కడ అంత సీన్ లేదు’ అంటూ రవిని ఆటపట్టించాడు.
బిగ్ బాస్ హౌస్ లో రవి కుమార్తె వియ మాట్లాడిన ఇంగ్లీష్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఎంతో మంది మన ఇంగ్లీష్ ఉంది ఎందుకు అంటూ సెటైర్లు వేసుకున్నారు. బిగ్ బాస్ అంకుల్ ని చూస్తానంటూ వియా చాలా అల్లరి చేసింది. అందరినీ ఎంతో బాగా పలకరించింది. ‘బిగ్ బాస్ అంకుల్ రోజూ మార్నింగ్ ప్లేచేసినట్లు నా కోసం ఒక పాట ప్లే చేయవా’ అంటూ రిక్వెస్ట్ చేసింది. అందుకు డాడీ చిత్రం నుంచి గుమ్మాడి గుమ్మాడి పాటను పెట్టి వియా కోరిక తీర్చాడు బిగ్ బాస్. ఇంక వెళ్లే సమయంలో వియా కంటతడి చూసి ప్రేక్షకులు అందరూ ఏడ్చేశారు. రవి అతని కూతురు బాండింగ్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. నిత్యా చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
