‘బిగ్ బాస్ 5 తెలుగు’ మంచి టీఆర్పీతో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇంట్లోని సభ్యులు గ్రూపులు కట్టడం, పక్కా ప్లాన్ ప్రకారం గేమ్ ఆడటం అందరూ చూస్తున్నారు. ఆక్రమంలోనే వారి మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఇంట్లో ఒకరి గురించి వాళ్లు లేనప్పుడు మాట్లాడటం ఎక్కువ సందర్భాల్లో చూస్తున్నాం. అలాంటి ఘటనల వల్లే ఈ గొడవలు జగుతున్నాయి. రవి, ప్రియ, లహరి గొడవలోనూ అదే ప్రధాన కారణం కూడా. లహరి వెళ్తూ రవికి అదే చెప్పింది కెమెరాలు ఉన్నాయి.. వెనక మాట్లాడకు అని. ఆ గొడవ నాగార్జున చొరవతో సద్దుమణిగింది. ఇప్పుడు ఇంట్లో మరో రచ్చకు తెర లేచింది. ఈసారి ఈ గొడవలో కూడా ప్రియ పాత్రదారిగా ఉంది. అసలు గొడవలు ప్రియ వల్ల అవుతున్నాయా? గొడవలు అయ్యే పరిస్థితుల్లోకి ప్రియ వెళ్తోందా అన్నది అర్థం కావట్లేదు.
హౌస్‌లో అందిరి ఫస్ట్ లవ్ గురించి షేర్ చేసుకోమన్నప్పుడు లోబో తన లవ్ గురించి చెప్పుకొచ్చాడు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లైంది.. ఒక కూతురు కూడా ఉందని చెప్పాడు. ఆమె ప్రేమకు గుర్తుగా అతను ప్రపోజ్ చేసిన తేదీ, సమయాన్ని తన కుడి కాలిపై పచ్చబొట్టుగా కూడా వేయించుకున్నాడు. అప్పుడు లోబో చాలా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ రెడ్ బెలూన్‌ని వదులుతాడు. ఆ తర్వాత ఏదో సందర్భంలో నటి ప్రియ లోబో లవ్ గురించి కామెంట్ చేసింది. అక్కడి దాకా బానే ఉంది.. అది మన లోబో చెవిలో పడింది. ఇంకేముంది నామినేషన్ సమయంలో తను ఆ మాట చెప్పి ప్రియ మీద సీరియస్ అయ్యాడు. అందుకు ప్రియ డోంట్ షౌట్ అనగానే.. బరాబర్ అరుస్తాను అంటూ ఊగిపోయాడు. నువ్వు అరిస్తే నేను తీసుకోను అనగానే.. ఐ డోంట్ కేర్ అంటూ లోబో మళ్లీ రెచ్చగొట్టాడు. ఈ క్రమంలో వచ్చిన రవి లోబోని కూల్ చేయాలని చూడగా నీకు తెలుసుకదరా అంటూ రవిని ప్రశ్నిస్తాడు లోబో. బిగ్ బాస్ హౌస్‌లో మన్‌డే అంటే ఫన్ డే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కొందరైతే వారంలో రెండుసార్లు నామినేషన్స్ పెట్టాల్సిందిగా సూచిస్తున్నారు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్ చూస్తుండండి.