ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన జవాద్ తుపాన్ తన దిశను మార్చుకుని ప్రయాణిస్తుంది. ఒడిస్సాలోని పూరి వైపు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిణామం కాస్త ఊరటను కలిగించనుంది. బంగాళఖాతంలో వాయుగుండం కారణంగా ఏర్పడిన ఈ తుపాన్ ఇప్పుడు ఒడిస్సాపై తన ప్రతాపం చూపనుంది.
