Digital Health Card Distribution: ప్రజా సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు కూడా తెచ్చుకుంటోంది. పలు మార్లు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది. తాజాగా, ఏపీ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏపీ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఎకనమిక్స్ టైమ్స్ విడుదల చేసిన అవార్డులో ఏపీకి మొదటి బహుమతి వచ్చింది.
హెల్త్ కార్డ్‌ల డిజిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు వచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని “డిజిటెక్ కాంక్లేవ్ 2022” కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి క్యూఆర్ కోడ్‌లతో కూడిన 1.4 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ జరిగింది. ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది.
ఇవి కూడా చదవండి : Nara Lokesh: భార్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేశ్! ఫోటోలు వైరల్!