తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో కీలక సాక్షిగా పరిగణిస్తున్న వ్యక్తి.. ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. ఈ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. గంగాధర్ రెడ్డి నిద్రపోయిన సమయంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే […]
కడప క్రైం- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుల్లో ఒకరైన వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి తన వాంగ్మూలంలో కీలక విషయాలను వెల్లడించాడు. ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సీపీఆర్పీసీ 164 ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, ఆగస్టు 25న […]