హింసాత్మక ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక సంఘటన స్థలానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, తదితరులను నిర్భందించిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఖేరీలోకి ఎవరూ కూడా అడుగుపెట్టకుండా యోగీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సారథ్యంలోని ఐదుగురు ప్రతినిధుల […]