కాబూల్- అఫ్గనిస్థాన్ ను అమెరికా పూర్తిగా తమ సైన్నాన్ని ఉపసంహరించుకుంది. ఈమేరకు అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం తరలింపు సోమవారం అర్ధరాత్రితో పూర్తయ్యింది. దీంతో 20 సంవత్సరాల అఫ్గాన్ లో అమెరికా ప్రస్థానానికి తెరపడింది. భారీ సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గన్ పుననిర్మాణానికి అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చుచేసినా.. అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇస్లామిక్ తాలిబన్ల అధికారంలో ఉన్నప్పుడు అఫ్గనిస్తాన్ లోకి ప్రవేశించిన అమెరికా, తిరిగి ఇప్పుడు వారి పాలనతోనే వెనక్కి వెళ్లిపోవడం కాకతాళీయం అని చెప్పవచ్చు. […]