తెల్లవారుజామున చైనాలో భారీ భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలోని కింగ్ హై ప్రావిన్సుల్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9 గా నమోదయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే అమెరికన్ జియోలాజికల్ ఏజెన్సీ భూకంప తీవ్రత 6.6గా పేర్కొంది. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టం పెద్దగా లేనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా […]