ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ అప్‌డేట్ ఒకటి విడుదలైంది. దక్షిణాది నుంచి ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు మోదీ బయోపిక్ తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించి ఇవాళ విడుదలైన పోస్టర్ వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకు ఇవాళ్టితో 75 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని ప్రముఖులు, సెలెబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టాలీవుడ్ దర్శకుడు ఆయన బయోపిక్ ప్రకటించారు. […]
మమ్ముట్టి, మోహన్ లాల్ నుండి మొన్న వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించినే షైన్ టామ్ చాకో వరకు మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన వారే. వారి నటనతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అటువంటి వారిలో ఒకరు ఉన్ని ముకుందన్. ఈ నటుడు ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.
ప్రముఖ మలయాళ హీరో.. భాగమతి ఫేమ్ ఉన్నిముకుందన్ పై 2018లో లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను ఉన్ని ముకుందన్ లైంగికంగా వేధించాడని, కొట్టాయం టౌన్‌కు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. స్టోరీ చర్చల కోసం తనను పిలిపించి వేధించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 2018 సెప్టెంబర్ 15న పోలీసులు ఉన్నిపై కేసు నమోదు చేశారు. తర్వాత అతడ్ని కోర్టులో కూడా హాజరు పరిచారు. ప్రముఖ న్యాయవాది సైబీ జోస్ కిడంగూర్ ఉన్ని […]
గత సినిమాల్లో విలన్ అనగానే ఓ భయంకర రూపం కనబడాల్సిందే. తెరపై నానా భీభత్సం సృష్టించాల్సిందే. దీంతో వారంటే ఓ రకమైన భయం ఏర్పడేది. సినిమాలో మాదిరిగానే బయట కూడా ఉంటామేమోనని, తమను చూడంగానే దూరంగా పారిపోయే వారని విలన్లుగా చేసిన నటీనటులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరోలే కాదూ.. విలన్లూ కూడా స్మార్ట్ గా ఉంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. హీరోల కన్నా వాళ్లకే క్రేజ్ వస్తుంది ఇప్పుడు. […]