ప్రపంచవ్యాప్తంగా దాదాపు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే ఒమిక్రాన్ నుంచి రక్షణ కలుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఈ కోత్త వేరియంట్ పై ఎంత ప్రభావం చూపుతాయన్నది సందేహాస్పదంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై రెండు డోసులతో లభించే రక్షణ పాక్షికమేనని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా తక్కువ ప్రతినిరోధకాలను […]