ప్రధాని నరేంద్ర మోదీ.. వెన్నుచూపని ధీరుడు, సూరుడని దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు కొనియాడుతుంటారు. అయితే ఉన్నట్టుండి మోదీ సాగు చట్టాల విషయంలో వెనకడుగు వేయటానికి అసలు కారణం ఏదైన దాగి ఉందా అని దేశ పౌరులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఏడాదిన్నర సుధీర్ఘకాలం పాటు సాగిన రైతుల దీక్షనే చట్టాల రద్దుకు కారణమని కొందరు పెదవి విప్పుతుంటే కాదు.. కాదు.. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలే మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు అసలు కారణమని […]