టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ నటనలో తనదైన ముద్ర వేస్తూ టాలీవుడ్ టూ హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్‌చరణ్ ఇటీవలే యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.