గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు ఆస్తి నష్టం..ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా వేలూరులోని పెర్నంబుట్‌లో ఇల్లు కూలిపోవడంతో తొమ్మిది మంది నిద్రలోనే మరణించారు. క్షతగాత్రులను రక్షించామని […]