బతకాలని రాసిపెట్టి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా బతుకుతారని పెద్దలు అంటుంటారు. చనిపోతారని అనుకున్న చాలా మంది బతికిన సందర్భాలను చూస్తూనే ఉన్నాం. సరిగ్గా అలాంటి కథే ఎల్విన్ ఫ్రాంకోయిస్ ది. కరీబియన్ ద్వీపాల్లోని డొమినికాకు చెందిన ఈ 47 ఏళ్ల వ్యక్తి.. 24 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో గడిపి, మృత్యువును నుంచి వెనక్కి తిరిగి వచ్చాడు. సముద్రంలో ఎక్కడున్నాడో తెలియదు, మాట్లాడేందుకు ఎవరూ లేరు, ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారో లేదో కూడా […]