హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చాలా యేళ్లుగా ఏపీ, తెలంగాణల మధ్య రహదారి మార్గం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021- 22 బడ్జెట్‌లో 600 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల, సిద్దేశ్వరం దగ్గర అత్యాధునిక ఐకానిక్ బ్రిడ్జ్.. అంటే తీగల వంతెన నిర్మాణానికి నివేదిక ఇచ్చింది. నేషనల్ హైవేస్ అధారిటీ […]