తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి పేరు ఖరారైంది. శాంతికుమారిని నూతన సిఎస్ గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సిఎస్ గా ఆమె బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎస్ గా మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే ప్రథమం. తెలంగాణ గత సిఎస్ సోమేశ్ కుమార్ సొంత రాష్ట్రమైన ఏపికి వెళ్లాలంటూ హైకోర్టు సూచించడంతో తదుపరి సిఎస్ ను నియామించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సిఎస్ సోమేశ్ కుమార్ ను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంద్రప్రదేశ్ […]