అత్యాచారం, మహిళలపై లైంగిక వేధింపుల విషయమై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెనక్కు తగ్గారు. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ కావడంపై గత నెల ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని ప్రలోభాలకు దూరంగా ఉండటం ద్వారా మహిళలపై లైంగిక వేధింపులను తగ్గించవచ్చన్నారు. మహిళలు ఆకర్షించే, రెచ్చగొట్టే ధోరణుల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపాయి. అంతకుముందు కూడా […]