గర్ల్ ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్ 498ఏ(మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించడానికి వీల్లేదని అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్ ఫ్రెండ్‌పై పోలీసులు 498ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్ తో పాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ సెక్షన్ కింద భర్త రక్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు […]