ఛత్తీస్ గఢ్- మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి చెందారని తెలియడంతో ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో విషాద ఛాయలు అలముకున్నాయి. పల్నాడు ప్రాంతం నుంచి ఉద్యమం మొలుపెట్టిన ఆర్కే అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్ట్ అగ్రనేతగా ఎదిగారు. ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మావోయిస్ట్ […]