గత కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రగడ కొనసాగుతుంది. తాజాగా తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. […]