గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు ప్రఫుల్లా కార్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. వృద్దాప్య కారణంగా ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారని ఇంటి సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా గుండెలో నొప్పి వచ్చిందని ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణించారని పేర్కొన్నారు. కార్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పురిలోని స్వర్గ ద్వారా శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనలాతో కార్ […]