తెలుగు చలన చిత్ర రంగంలో పవర్‌ఫుల్ అత్తగా ఎన్నో చిత్రాల్లో నటించిన సూర్యకాంతం పేరుపై పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది. ఈ నెల 18న ఆ కవర్ ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యకాంతం పేరున కాకినాడలోని సత్కళావాహినిలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ సుంకర శివప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జీఎం వెంకటేశ్వర్లు […]