ఆ గ్రామంలోని మహిళలు ఓ కీలక నిర్ణయానికి కట్టుబడి మంచి పనికి పూనుకున్నారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అంగీకార పత్రాలపై సంతకాలు చేయనున్నారు.
ప్రేమ గుడ్డిది అని అంటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ వాక్యాన్ని పాజిటివ్ సెన్స్ లో వాడుతూ ఉంటారు. అయితే తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తే.. దానిని నెగిటివ్ సెన్స్ లోనే ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ప్రేమ అనే పేరుతో ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు డబ్బుకోసం ప్రేమను వాడుకుంటుంటే.. ఇంకొందరు ఏకంగా ప్రేమను అడ్డుపెట్టుకుని ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ కథే అందుకు నిదర్శనం. ప్రేమించిన […]
ఇటీవల కొంత మంది చనిపోతూ తమ అవయవదానాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాము మరణించినా కూడా వారిలో బతికే ఉంటున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను కన్నుమూసినా.. ఐదుగురు కుటుంబాల కళ్లల్లో వెలుగులు నింపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ తాను చనిపోతూ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నా బత్తుల విజయ్ కుమార్ ఇటీవల తన బైక్ […]
చేతికి అంది వచ్చిన కొడుకు ఇక తమ బాధ్యతలు నిర్వర్తిస్తాడనే భరోసాతో ఆ తల్లిదండ్రులు ధైర్యంగా, ధీమాగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలు కుమారుడికి అప్పగించి.. తాము విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మద్యం మహమ్మారి వారి ఇంట ఆరని చిచ్చు పెట్టింది. ఆసరాగా నిలుస్తాడని భావించిన కుమారుడు.. బతికున్న శవంలా మారాడు. బిడ్డ ఎన్నటికి కోలుకోలేడు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు శోకాన్ని దిగమింగుకుని తీసుకున్న నిర్ణయం మరో ఐదుగురి ఇంట […]
జీవన్‌దాన్!… అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది. బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది. బ్రెయిన్‌డెడ్ అయిన దాతల నుంచి అవయవాలను సేకరించి […]