రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణానికి ఏర్పాట్లు సిద్దం అయ్యాయి. రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తితిదే తెలిపింది. స్వామి వారి కల్యాణం కొరకు వంద కిలోల ముత్యాల తలంబ్రాలు దాదాపు రెండు లక్షల ప్యాకెట్లలో ఏర్పాటు చేసి.. కళ్యాణ మహోత్సవం తర్వాత భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో పలు ప్రదేశాల నుంచి గోటితో ఒలిచి తెచ్చిన తలంబ్రాలను స్వామికి వారికి సమర్పించేందుకు సిద్దం […]