మార్కెట్లో సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి లేనే లేదు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. అదే బాటలో ఉల్లి కూడా ఘాటెక్కనుంది.
ఏ ఇంట్లో అయినా ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. భారతీయ వంటకాల్లో ఉల్లి పాత్ర ప్రధానమైనది. ఉల్లి ధర పెరిగితే.. ఓ పాయ.. తగ్గితే రెండు పాయలు వేసుకుని వంట పూర్తి చేస్తారు నారీ మణులు. నిన్న, మొన్నటి వరకు ఉల్లి ధరలు పెరగ్గా.. ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి.
ఇక్కడ ఉల్లికి ధర లేక రైతులను కన్నీళ్లు తెప్పిస్తుంంటే.. అక్కడ మాత్రం ఉల్లి ధర ఏకంగా ఆకాశానికి ఎగబాకింది. కిలో ఉల్లి ధర రూ.1200 పెరిగి అక్కడి సామాన్య ప్రజలు ఉల్లి కట్ చేయకముందే ధరను చూసి కన్నీళ్లు పెడుతున్నారు.